breaking news
goods trains
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాం నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో బిలాస్పూర్ వెళ్లే మార్గంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఆగిఉన్న గూడ్స్ ట్రైన్‌ను కోర్భా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 10మంది ప్రయాణికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సహాయ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. బిలాస్పూర్ స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్‌ఖాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్యాసింజర్ రైలు హౌరాకు వెళ్తుండగా.. వ్యతిరేక దిశలో వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్యాసింజర్ రైలు ముందు భాగం గూడ్స్ పైకి చొచ్చుకుపోయింది. ఒక కంపార్ట్మెంట్ పూర్తిగా దెబ్బతినగా.. గూడ్సు రైలు ఇంజన్‌కు భారీ నష్టం వాటిల్లింది. చాలా మంది ప్రయాణికులు కోచ్‌లలో చిక్కుపోయారు. స్థానికులు, రైల్వే సిబ్బంది, పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమాద వార్త వినిపించిన వెంటనే ఆగ్నేయా మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తరుణ్ ప్రకాష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు బిలాస్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) రాజ్మల్ ఖోయివాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసిన రైల్వే శాఖ ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థరైల్వే ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో, రైలు ఒక నిర్దిష్ట పరిమితిలో వేగంతో నడుస్తుంది. ఈ వ్యవస్థతో మూడు రైళ్లు ఒకే ట్రాక్ పై వెళ్లవచ్చు. ప్యాసింజర్ రైలు గురించి డ్రైవర్ అధిక వేగంతో రైలును నడుపుతున్నాడని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, డ్రైవర్ రైలును అదుపు చేయలేకపోయాడు, అకస్మాత్తుగా గూడ్స్ రైలు ముందు ప్రమాదం జరిగింది. ఈ విధానం కింద రైళ్లు పగటిపూట గంటకు 15 కిలోమీటర్లు, రాత్రి సమయంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడపాల్సి ఉంటుంది.హెల్ప్ లైన్ నంబర్:చంపా జంక్షన్: 808595652రాయ్‌గఢ్: 975248560పెండ్రా రోడ్డు: 8294730162ప్రమాద స్థలం: 9752485499, 8602007202 #Chhattisgarh #trainaccident: Collision between stationary Goods & Korba Passenger train Casualties feared, over 20 injured near Jairamnagar station along Bilaspur route under SECR Zone. Details awaited @NewIndianXpress @santwana99 @jayanthjacob pic.twitter.com/zrxTZwH3b6— Ejaz Kaiser (@KaiserEjaz) November 4, 2025 -
మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్
కోల్కత్తా: ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా రెండు గూడ్స్ రైళ్లు పట్టాలపై ఢీకొన్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో బంకూర ప్రాంతంలోని ఓండా స్టేషన్ వద్ద లూప్లైన్లో ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. 12 బోగీలు పట్టాలపై పడిపోయాయి. ఇక, ఈ ప్రమాదంలో ఒక రైలు లోకోపైలట్‌కు గాయాలైనట్టు సమాచారం. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పలు రైళ్లు రద్దు.. ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. #ser #IndianRailways pic.twitter.com/WtvccLPEyR — South Eastern Railway (@serailwaykol) June 25, 2023 ఇది కూడా చదవండి: ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన! -
బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు నిరసనగా రైతు సంఘాలు సోమవారం చేపట్టిన రైల్ రోకో కారణంగా దేశవ్యాప్తంగా 293 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 150 గూడ్స్ రైళ్లకు ఆటంకం ఏర్పడగా వీటిలో 75 వరకు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న రైళ్లు ఉన్నట్టు సమాచారం. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేడు రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంజాబ్‌లోని ఫిరోజిపూర్ డివిజన్లోని నాలుగు రైల్వే విభాగాలు రైతుల ఆందోళనతో స్తంభించాయని అధికారులు తెలిపారు. ఫిరోజ్‌పూర్ నగరంలోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా విభాగం, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్‌పూర్-లూధియానా విభాగంపై నిరసనల ప్రభావం పడిందని వెల్లడించారు. మిశ్రాను అరెస్ట్ చేసే వరకు విశ్రమించం: తికాయత్ 'రైల్ రోకో' ఆందోళన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడైన అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రాకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, కేంద్రం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలితే మళ్లీ మంత్రి కట్టబెట్టుకోవచ్చని తికాయత్ అన్నారు. (చదవండి: హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు) -
రైతుల్లో గూడ్స్ గుబులు
గొల్లపూడి (విజయవాడ రూరల్) : విజయవాడ రైల్వే జంక్షన్లో ప్రయాణికుల రద్దీ రాను రాను పెరుగుతోంది. ఈనేపధ్యంలో గూడ్స్ రైళ్లను విజయవాడ ప్రధాన రైల్వేస్టేషన్‌కు రాకుండా ప్రత్యేక రైల్వే మార్గం నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, అహ్మాదాబాద్, ముంబాయి ఆ పై ప్రాంతాల నుంచి వచ్చే గూడ్స్ రైళ్లను విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌కు రాకుండా కొండపల్లి నుంచి గన్నవరం వెళ్లే విధంగా ప్రత్యేక మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ ఇప్పటికే 306 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిసింది. అయితే ప్రత్యేక రైల్వే లైను వేసేందుకు అవసరమైన భూములను తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు భూముల యజమానుల వివరాలను సేకరించింది. గొల్లపూడి,రాయనపాడు, గ్రామాల్లోని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుతో తమ భూములు కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. రాయనపాడు, గొల్లపూడి ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల్లో ఈ మార్గం నిర్మించనున్నట్లు తెలిసింది. గొల్లపూడిలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారి ఎలైన్‌మెంటుకు ఉత్తరంగా వంద అడుగుల దూరంలో ఈ రైల్వే మార్గం ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం భూసేకరణ చేసి భూములను తీసుకొంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రిజిస్ట్రేషన్ ధరకు మూడు రేట్లు వస్తోందని, అయినా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువతో పోల్చుకుంటే తక్కువేనని సంబంధిత భూ యజమానులు అంటున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 25 లక్షల రూపాయలుండగా మూడు రేట్లు వస్తే 75 లక్షలేనని, మార్కెట్ విలువ కోటి రూపాయలకు పైగా ఉందని చెబుతున్నారు. రాష్ట్ర రాజధానికి తలమానికంగా ఉన్న గొల్లపూడిలో భూములధరలు పై పైకి వెళతాయని ఆశపడిన వ్యాపారులు గూడ్సు రైల్వే మార్గంతో నష్టపోతామని తలలు పట్టుకుంటున్నారు. గ్రామంలో రియల్ ఎస్టేటు వ్యాపారులు ఎలైన్‌మెంట్‌ను మార్పుచేయించేందుకు రాజకీయనాయకుల ద్వారా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మూడు ఎక్స్‌ప్రెస్ రైలు లైన్లు గొల్లపూడి గ్రామాన్ని తాకుతూ వెళ్తున్నాయని, ఆరు విద్యుత్టవర్లు నిర్మించడంతోlఎంతో నష్టపోయామని గ్రామస్తులు అంటున్నారు. -
గార్డులు లేని గూడ్స్ రైళ్లు రాబోతున్నాయ్!
న్యూఢిల్లీ: సరకు రవాణా రైలు చివరి బోగీలో ఇక గార్డులు కనిపించరేమో. ప్రస్తుత మున్న విధానంలో మార్పులు చేసేందుకు రైల్వే శాఖ కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ(ఈఓటీటీ)గా పిలిచే పరికరాన్ని ఆఖరి బోగీలో అమరుస్తారు. ట్రాన్స్మిటర్ను లోకోమోటివ్‌కు బిగిస్తారు. రైలు నడుస్తున్నపుడు అంతా సవ్యంగానే ఉందని తెలిపేలా నిరంతరం ఈ రెండింటి మద్య సమాచార మార్పిడి జరుగుతుంది. సమాచార అంతరాయం కలిగితే డ్రైవర్‌కు సంకేతం అందుతుంది. తదనుగుణంగా రైలును అపి విడిపోయిన బోగీలను తిరిగి కలపడం లేదా ఇతర పునరుద్ధరణ పనులు చేసే వీలుంటుంది. ఈఓటీటీ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉందని రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ తెలిపారు. తొలిదశలో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ఇలాంటి పరికరాలు వేయి కొనుగోలుచేసే ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.


