వీడియో వైరల్‌: భోజనంలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు?! | Bhopal University canteen staff eats 'lizard' found in food to prove it is capsicum | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌: భోజనంలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు?!

Mar 24 2026 1:20 PM | Updated on Mar 24 2026 1:30 PM

Bhopal University canteen staff eats 'lizard' found in food to prove it is capsicum

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఐటీ–ఆర్జీపీవీ) హాస్టల్ మెస్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్‌లో బల్లి కళేబరం (లిజార్డ్) కనిపించింది.

దీంతో ఆ విద్యార్థి మెస్ సిబ్బందిని నిలదీశాడు. ‘అన్నా, ఇది ఏమిటో చూడండి. నాకు అనుమానం వస్తోంది’ అని ప్రశ్నించాడు. సిబ్బంది మాత్రం ‘ఇది బల్లి కాదు, సిమ్లా మిర్చి (క్యాప్సికమ్‌)’ అని సమాధానం ఇచ్చారు. 

విద్యార్థి మాత్రం  ‘ఇది బల్లే.. గుడ్లు తేలేసింది’ అని వాదించాడు. ఈ మాటలతో అసహనానికి గురైన ఓ సిబ్బంది, ప్లేట్‌లో ఉన్న ఆ ముక్కను తీసుకుని తిన్నాడు. ‘ఇది బల్లి కాదు.. క్యాప్సికమే’ అని నిరూపించడానికి ప్రయత్నించాడు.

ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో మెస్ పరిశుభ్రతపై విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. నెటిజన్లు సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్లేట్‌లో నిజంగా బల్లి కళేబరమేనా? లేక క్యాప్సికమ్‌ ముక్కనా? అన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement