Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్‌ షా | Bharat Ratna to Karpoori Thakur an honour for poor, backward classes | Sakshi
Sakshi News home page

Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్‌ షా

Jan 25 2024 6:07 AM | Updated on Jan 25 2024 6:07 AM

Bharat Ratna to Karpoori Thakur an honour for poor, backward classes - Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొనియాడారు.

అయోధ్యలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. బుధవారం ఇక్కడ ఠాకూర్‌ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కర్పూరి స్ఫూర్తితో అన్ని వర్గాలనూ సమాదరిస్తూ మోదీ ప్రభుత్వం సాగుతోందన్నారు. ముఖ్యంగా ఓబీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement