Tomato Price Hike: 15 కేజీల టమాటా రూ.వెయ్యి..

In Bengaluru, Tomato Price Reaches Rs 80 per kg Due to Rains - Sakshi

కోలారు మార్కెట్లో రికార్డు ధర   

సాక్షి, కోలారు: జిల్లావ్యాప్తంగా కొన్నిరోజులుగా కురుస్తున్న వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. టమాటకు అతి పెద్ద విపణి అయిన కోలారు ఎపిఎంసి మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. 15 కేజీల టమోటా బాక్సు రూ.వెయ్యికి వేలం పాడడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది.

పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వానల కారణంగా టమాట దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు సరుకు కోసం కోలారు మార్కెట్‌కు వస్తున్నారు. దీంతో టమాట లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. రెండు నెలల కిందట వరకు టమాట బాక్స్‌ రూ.250 కంటే తక్కువగానే ఉండేది. గిరాకీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక బయట కూరగాయల మార్కెట్లలో కేజీ ధర నాణ్యతను బట్టి రూ.70– 80 వరకూ ఉంటోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top