దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు

Ayodhya Grand Deepotsav Program will be Organized - Sakshi

శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే దీపావళికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఈ నేపధ్యంలో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు యూపీలోని అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీపావళి రోజున అయోధ్యలో దీపాల పండుగతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

రామాయణంలోని పలు సంఘటనల ఆధారంగా వివిధ నృత్య , సంగీత కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. రామాయణంలోని వివిధ పాత్రలతో కూడిన శకటాలు రామకథా పార్కుకు చేరుకుంటాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీటికి సారధ్యం వహిస్తారు.

దీపావళి రోజున సరయూ నది ఒడ్డున నిర్వహించే దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏ‍ర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున ఇక్కడికి తరలివచ్చే భక్తుల కోసం అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: యోగి సర్కార్‌ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top