బీహార్‌లో కూలిన మరో వంతెన | Another Bridge Collapsed In Bihar | Sakshi
Sakshi News home page

బీహార్‌లో కూలిన మరో వంతెన

Published Sat, Jun 22 2024 12:08 PM | Last Updated on Sat, Jun 22 2024 12:15 PM

Another Bridge Collapsed In Bihar

బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అరారియాలో ఓ వంతెన కూలిపోయిన ఘటన మరువక ముందే సివాన్‌లోని దారుండా బ్లాక్‌లోని రామ్‌గర్హాలోని గండక్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడం కలకలం రేపుతోంది.

పాతేడీ బజార్- దరౌండా బ్లాక్‌లను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే అరారియాలో ఓ వంతెన కూలిపోయింది. ఆ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా సివాన్‌లోని కాలువకు వంతెనకు ఒకే పిల్లర్‌ ఉండగా అది కూడా కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోయింది.

ఈ వంతెన నిర్మించి ఏడాది కూడా గడవకముందే కూలిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement