పూంచ్‌ బాధితులకు హోం మంత్రి పరామర్శ | Amit Shah Poonch Visit Meeting with Victims Families | Sakshi
Sakshi News home page

పూంచ్‌ బాధితులకు హోం మంత్రి పరామర్శ

May 30 2025 1:35 PM | Updated on May 30 2025 3:07 PM

Amit Shah Poonch Visit Meeting with Victims Families

శ్రీనగర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించారు. ‘మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. ఇది పిరికితనంతో కూడిన చర్య. పాక్‌ దాడులలో పలువురు భారత పౌరులు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ  అవకాశాలు కల్పిస్తోంది. వారికి సంఘీభావం ప్రకటిస్తోంది’ అని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

ఈరోజు (శుక్రవారం) హోంమంత్రి పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను  అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్ముకశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్‌ షా పేర్కొన్నారు. మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత ప్రజల సంకల్పం, ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) నిర్ణయాత్మక నాయకత్వం, ఖచ్చితమైన నిఘా సమాచారం, మన సాయుధ దళాల అసమానమైన దాడి కారణంగా పాక్‌పై బలమైన ప్రతీకారం తీర్చుకోగలిగమని షా అన్నారు.
 

మన సైనికులు వందలాది మంది ఉగ్రవాదులను తరిమికొట్టారు. ఈ సమయంలో ఒక్క భారత ఆర్మీ పోస్టు కూడా దెబ్బతినలేదు. ఏ పాకిస్తానీ పౌరుడికి కూడా హాని జరగలేదు. మనం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాం. అయితే పాకిస్తాన్‌ మన దేశంలోని పూంచ్‌కు తీవ్ర నష్టం కలిగించింది. భారత సైన్యం తొమ్మిది పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్‌ దిగివచ్చిందని అమిత్‌ షా పేర్కొన్నారు. ఏప్రిల్ 6 తర్వాత అమిత్ షా జమ్ముకశ్మీర్‌లో జరిపిన మూడవ పర్యటన ఇది. 

ఇది కూడా చదవండి: ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

Advertisement
 
Advertisement
Advertisement