పరారీలో ఉన్న పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టు | AAP MLA Harmeet Singh Pathan Arrest AT Punjab | Sakshi
Sakshi News home page

పరారీలో ఉన్న పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టు

Mar 26 2026 7:14 AM | Updated on Mar 26 2026 7:14 AM

AAP MLA Harmeet Singh Pathan Arrest AT Punjab

పటియాలా: అత్యాచారం కేసులో అరెస్టయి, పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న ఆప్‌ ఎమ్మెల్యే హరీ్మత్‌ సింగ్‌ పఠాన్‌మాజ్రా అరెస్టయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పంజాబ్‌ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అత్యాచారం, మోసం, బెదిరింపుల ఆరోపణలపై గతేడాది సెపె్టంబర్‌ 1న మాజ్రాపై కేసు నమోదైంది. 

విడాకులు తీసుకున్నానని చెప్పి, అప్పటికే వివాహమైన తనను పెళ్లి చేసుకున్నారని జిరక్‌పూర్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. హర్యానాలోని కర్నాల్‌లో జిల్లాలో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారు. పోలీసు బృందంపై ఎమ్మెల్యే మద్దతుదారులు కాల్పులు జరిపారు. దాంతో ఆయన పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నారు. చివరకు మంగళవారం రాత్రి అరెస్టయ్యారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement