16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి

16000 surgeries performed by Cardiologist Gaurav Gandhi dies of heart attack at 41 - Sakshi

గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయస్సుతో సంబంధం లేకుండా దీని భారిన పడుతున్నారు. అయితే.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డా. గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన డా. గౌరవ్ గాంధీ అంటే ఆ ప్రాంతంలో తెలియనివారుండరు. ఆయన చేతితో ఎన్నో గుండె ఆపరేషన్‌లు చేశారు. ఎందరి ప్రాణాలనో రక్షించారు. గుండెకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి అనేక సూచనలు చేసేవారు. కేవలం నాలుగు పదుల వయస్సులోనే సుప్రసిద్ధ కార్డియాలజిస్టుగా పేరుగాంచారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే గుండెపోటుతో మరణించారు.

సుమారు 16 వేల ఆపరేషన్లు ఆయన ఇప్పటివరకు చేశారు. సోమవారం రాత్రి ఎప్పటిలానే ఆస్పత్రి పనులు ముగించుకుని ప్యాలెస్ రోడ్డులోని ఇంటికి చేరారు. రోజూలానే భోజనం పూర్తి చేసుకుని నిద్రకు వెళ్లారు. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. సృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆయన ‍‍అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే కారణమని స్పష్టం చేశారు. రాత్రి నిద్రకు వెళ్లే సమయంలో ఎలాంటి అసౌకర్యంగా ఆయన కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలుపారు. ఆయన మంచి ఆహారాన్నే తీసుకున్నారని వెల్లడించారు. డా. గాంధీ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి:కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. వారి ఐదు డిమాండ్లు ఇవే..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top