
పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకిన
ప్రాణాపాయ స్థితిలో చికిత్స
తమిళనాడు: తన 40 ఏళ్ల ప్రియుడితో వెళ్లేందుకు యత్నించి పట్టుబడిన ఓ 10వ తరగతి విద్యార్థిని పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకి కలకలం సృష్టించింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితిలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. నెల్లై జిల్లాలోని పత్తమడైకి చెందిన మురుగన్ (40). ఇతను కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. అతను పత్తమడై ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సోషల్ మీడియా ద్వారా కలుసుకుని ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నారు. తరు వాత, ఇద్దరూ సెల్‌ఫోన్ల ద్వారా తమ సంబంధాన్ని కొనసాగించారు.
ఈనెల 14వ తేదీన పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అకస్మాత్తుగా అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రులు పత్తమడై పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న చేరన్మా దేవి ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి తిరుచెందూర్ వెళ్లిందని తేలింది. పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు తిరుచెందూర్ వెళ్లి ఇద్దరు వ్యక్తులను బుధవారం ఉదయం అక్కడికి తీసుకువచ్చారు. తరువాత, ఆల్–ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించినప్పుడు, విద్యార్థిని తన తల్లిదండ్రులతో వెళ్లడానికి ఇష్టపడలేదు.
ఆమె తన ప్రియుడిని విడిచిపెట్టనని స్పష్టంగా చెప్పింది. అయితే విద్యార్థిని మైనర్ కావడంతో పోలీసులకు అప్పగిస్తామని తేల్చారు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ మిద్దెపై నుంచి దూకింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయి ప్రాణపాయ స్థితిలో ఉంది. వెంటనే పోలీసులు అతన్ని రక్షించి చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మురుగన్‌ను అరెస్టు చేశారు. మురుగన్‌కు వివాహం జరిగి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పడం గమనార్హం.