నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నాలుగు పోస్టులు మంజూరయ్యాయి. గతంలో కార్యాలయం ప్రారంభించగా.. ఏంవీఐ, జూనియర్ అసిస్టెంట్ ఇతర జిల్లాల నుంచి డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించేవారు. తాజాగా జరిగిన బదిలీల్లో నాలుగు పోస్టులను నారాయణపేటకు కేటాయించారు. హైదరాబాద్ జేటీసీ సెంట్రల్ జోన్ నుంచి సి.రామేశ్వర్‌రెడ్డి, ఎంవీఐ అధికారిగా ఇబ్రహీంపట్నం నుంచి ఎస్‌కే మున్నీని కేటాయించారు. అసిస్టెంట్ ఏంవీఐలుగా నాగర్‌కర్నూల్ నుంచి దీప్తి, సంగారెడ్డి నుంచి గౌతంరాజు వస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన మేఘగాంధీ వికారాబాద్ జిల్లాకు కేటాయించగా నారాయణపేటలో విధులు నిర్వహించారు. అయితే తాజా బదిలీల్లో వనపర్తి జిల్లా పెబ్బేరుకు కేటాయించారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నాగర్‌కర్నూల్ నుంచి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట రూరల్: నారాయణపేటలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న మూడు పీజీసీఆర్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రత్యేక అధికారి శ్వేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లం బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలని.. ఈ నెల 6 వరకు పాఠశాలలో బయోడేటా, విద్యా అర్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు అందించాలని సూచించారు.
మాగనూరులో.. స్థానిక కేజీబీవీపీ పాఠశాల, కళాశాలలో హిందీ (సీఆర్టీ), వృక్షశాస్త్రం, తెలు గు, ఆంగ్లం, రసాయన శాస్త్రం, భౌతిక శా సత్రం, జంతుశాస్త్రం, ఎంఎల్‌టీ (పీజీసీఆర్టీ) బోధించుటకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఓ రాధి క మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మహిళా అభ్యర్థులు అర్హులని.. అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఆరోతేదీ వరకు బయోడేటా, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తులు స్వయంగా సమర్పించాలని పేర్కొన్నారు.
మరికల్‌లో..స్థానిక కేజీబీవీలో 2026–27 విద్యా సంవత్సరం అతిథి అధ్యాపకుల నియా మకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధి కారి రాజ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలుగు, ఆంగ్లం, వృక్ష, రసాయన, భౌతిక శాస్త్రం, వ్యవసాయం బోధించుటకు ఆ యా సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ పూర్తిచేసిన అర్హుల ని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 10 లో గా పాఠశాలలో అందజేయాలని సూచించారు.
కృష్ణా.. కృష్ణా: మండలంలోని కస్తూర్బాలో ఖాళీగా ఉన్న తెలుగు (సీఆర్టీ), వృక్షశాస్త్రం (పీజీసీఆర్టీ), పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఓ షాలిని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని, బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలతో పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ అంటే
ఆత్మ గౌరవం : బీఆర్‌ఎస్
నారాయణపేట: తెలంగాణ అంటే కేవలం రాష్ట్రం కాదని.. ఒక భావోధ్వేగం, ఆత్మగౌరవం, చరిత్ర, విజయమని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అనేక దశాబ్దాల పోరాటానికి నాయకత్వం వహించి కోట్లాది ప్రజల కలను సాకారం చేసిన మహానేత, తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, గురుకులాల విస్తరణ, కేసీఆర్ కిట్, దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అమరుల త్యాగాలు, సకలజనుల సమ్మె, కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మైలురాళ్లుగా నిలిచాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మొసటి జ్యోతి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, కౌన్సిలర్లు భరత్, కాకర్ల నారాయణమ్మ, మాజీ ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.


