ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టాలి : కలెక్టర్‌

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

నారాయణపేట: ప్లాస్టిక్‌ వినియోగంతో భూగర్భ జలాలు, మట్టి నాణ్యత, పశుపకా్ష్దులు, అడవులు, పర్యాటక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని.. నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ నిర్మూలనపై రూపొందించిన అవగాహన పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారిందని, జిల్లాలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్లాస్టిక్‌ రహిత అడవులు, పర్యాటక ప్రాంతాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కాగితం, వస్త్ర సంచులు వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఓ కమాలుద్దీన్‌, పద్మారావు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement