బస్టాండ్‌ పునర్నిర్మాణానికి చర్యలు : ఆర్టీసీ ఎండీ | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌ పునర్నిర్మాణానికి చర్యలు : ఆర్టీసీ ఎండీ

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

కొత్తపల్లి(మద్దూరు): మద్దూరులో ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్‌ పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోస్గి డిపో మేనేజర్‌ లావణ్యను ఆదేశించారు. మంగళవారం ఆయన కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి బస్టాండ్‌, ఆవరణ, నిర్మాణానికి పరిస్థితులను పరిశీలించారు. అలాగే ఆక్రమణకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించాలని పుర చైర్‌పర్సన్‌ సరస్వతి జనార్దన్‌కు సూచించారు. బస్డాండ్‌ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి భూమిపూజకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మద్దూరుకు రాత్రి 7 గంటలకు బస్సు బయలుదేరి నైట్‌హాల్ట్‌ మద్దూరులో ఉండేలా చూడాలని పట్టణవాసులు కోరగా పరిశీలించాలని డిపో మేనేజర్‌కు సూచించారు. ఆయన వెంట ఈడీ కుశ్రుఖాన్‌, ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహులు, పుర కౌన్సిలర్లు గోవిందు, కో–ఆప్షన్‌ సభ్యుడు హబీబా రియాజ్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జీడీ వెంకట్రాములు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement