అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నారాయణపేట: తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, యువతులు ప్రదర్శించిన జానపద, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక పేర్కొన్నారు. కళలు, సంస్కృతిని పరిరక్షించడంలో యువత ముందుండాలని సూచించారు. విద్యార్థులను వారు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement