ఎన్నికల విధుల్లో అలసత్వం వహించొద్దు
మక్తల్: మూడో విడత జరిగే పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. ఎన్నికల విధుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రి పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఒకటికి రెండు సార్లు పోలింగ్ సామగ్రిని సరిచూసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. కాగా, మక్తల్ మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్.. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్ ఉన్నారు.


