రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో మూడో స్థానం
నారాయణపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 బాలుర క్రికెట్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించి ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని సూచించారు. జట్టు ఎంపిక, రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచేందుకు తనవంతు కృషిచేసిన డీవైఎస్‌ఓ శెట్టి వెంకటేశ్‌ను కలెక్టర్ అభినందించారు.


