రుజువైతే జైలుశిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట.. ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇచ్చాకే ఏకగ్రీవంపై ముందుకెళ్తాం.
– బీఎం సంతోష్,
కలెక్టర్, జోగుళాంబ గద్వాల
గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు.
– గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు
ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం.
– రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్
●
రుజువైతే జైలుశిక్ష.. అనర్హత వేటు
రుజువైతే జైలుశిక్ష.. అనర్హత వేటు


