సైక్లింగ్‌లో సత్తా చాటాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్ బి.గోపాలం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం నుంచి వెంకటాంపల్లి వరకు బాలికలకు 5 కిలోమీటర్లు, బాలురకు 8 కిలోమీటర్ల జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో బాలికల విభాగంలో శశి, ప్రియ, మీనాక్షి, ఇందు, చందన, ప్రవస్తి, జ్యోతి, సంజన, పూజ, సంగీత, బాలుర విభాగంలో రాము, ఉదయ్, రక్షిత, యశ్వంత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా రు. విజేతలకు గోపాలం పతకాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీలు దేవేందర్, చిట్టి, పాఠశాల ఏఎన్‌ఎం వెంకటమ్మ, సహాయకులు రజిత, నవీన్ పాల్గొన్నారు.


