ఎదురు చూడాల్సిందే..
గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్మికులు ప్రతిరోజు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాల్సిందే. జీతాలు మాత్రం ఎప్పుడు వస్తాయేనని నెలలపాటు ఎదురు చూడాలి. కుటుంబం నడవడానికి ప్రతినెల అప్పులు చేసి మూడునాలుగు నెలలకు ఒకసారి వచ్చే జీతాలతో చేసిన అప్పులకు మిత్తి కడుతున్నాం. దయచేసి పంచాయతీ కార్మికుల వేతన బాధలను అర్థం చేసుకొని ఇకనైన ప్రతినెల జీతాలు అందించి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి.
– నర్సమ్మ, కార్మికురాలు, కోటకొండ
ప్రతి నెలా ఖాతాల్లో జమ చేయాలి
ప్రభుత్వాలు మారుతున్నా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు మారడం లేదు. ఎన్ని పోరాటాలు చేస్తున్న కనీసం ప్రతి నెల వేతనాలు అందుకోలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న కార్మికుల శ్రమను గుర్తించి పంచాయతీల ద్వారా కాకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల వేతనాలు జమ చేయాలి. గ్రామాల పరిశుభ్రతలో కీలకంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు మూడు నెలలకొకసారి వేతనాలు అందుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– నర్సిములు, పంచాయతీ కార్మికుల
సంఘం జిల్లా అధ్యక్షుడు
ఎదురు చూడాల్సిందే..


