చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?! | - | Sakshi
Sakshi News home page

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!

Nov 6 2025 9:46 AM | Updated on Nov 6 2025 9:46 AM

చెరువ

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!

లక్ష్యం.. ‘నీళ్ల’పాలు

తేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.81 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకోగా.. మిగతా నాలుగు జిల్లాల్లో సగం కూడా చేరుకోలేకపోయారు. మొత్తంగా 4,56,68,000 చేపపిల్లలను మాత్రమే నీటిలో వదలగా.. అది కూడా అదును దాటిన తర్వాత అక్టోబర్‌ చివరలో మొదలుపెట్టి నవంబర్‌ చివరలో పూర్తి చేశారు. పలు జిల్లాల్లో అదును దాటిన నేపథ్యంలో 35–40 ఎంఎం సైజు చేపలు వేయలేదు. 80–100 ఎంఎం సైజు గల చేప పిల్లలనే వదిలినా సరిగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇందుకు అదును దాటిన తర్వాత చేప పిల్లలు వదలడమే కారణమని చెబుతున్నారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గత నెల 17న పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అదునుదాటిన తర్వాత చేప విత్తనాలు సరఫరా చేయడం.. నిర్దేశిత లక్ష్యంలో కోత పెట్టి తూతూమంత్రంగా ముగించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్లు మేలు రకాలకు తిలోదకాలు ఇస్తుండడంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు.

అదును దాటిన తర్వాతే చేప పిల్లల పంపిణీ

చివరికి నిర్దేశిత టార్గెట్‌లోనూ సగం మేర కుదింపు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిఏటా ఇదే తంతు

కాంట్రాక్టర్ల చేతిలోనే మత్స్యకారుల భవిష్యత్‌

‘అధికార’ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తేనే ఫలితం

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!1
1/3

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!2
2/3

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!3
3/3

చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement