వైభవంగా పడమటి అంజన్న తులాభారం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పడమటి అంజన్న తులాభారం

Nov 6 2025 9:46 AM | Updated on Nov 6 2025 9:46 AM

వైభవంగా పడమటి అంజన్న తులాభారం

వైభవంగా పడమటి అంజన్న తులాభారం

మక్తల్‌: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి మక్తల్‌ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామివారికి తులాభారాన్ని వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉడిపి పెజావర మఠం ధర్మప్రచారక్‌ విద్వాన్‌ రాఘవేంద్ర చార్య పర్యవేక్షణలో స్వామివారికి ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి విగ్రహాలను ఒక వైపు ఉంచి మరోవైపు కండ చక్కెర, పండ్లు, ఫలాలు, నాణెములను వేసి స్వామివారికి తులాభారం నిర్వహించారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఓ వైపు భక్తుల గోవింద నామస్మరణల మధ్య తులాబారం నిర్వహించగా పలువురు పండ్లు ఫలాలు, కండ చక్కెర ధనమును సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement