‘పవర్‌’ ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

‘పవర్‌’ ఫుల్‌

Oct 23 2025 9:37 AM | Updated on Oct 23 2025 9:37 AM

‘పవర్

‘పవర్‌’ ఫుల్‌

జూరాల జల విద్యుత్‌ కేంద్రాల్లో లక్ష్యానికి మించి ఉత్పత్తి

ఆత్మకూర్‌: జూరాల జల విద్యుత్‌ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్‌ 22వ తేదీ నాటికి 882 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు. 2022–23లో నవంబర్‌ చివరి నాటికి 640 మిలియన్‌ యూనిట్ల లక్ష్యానికిగాను 876 మి.యూ.గా నమోదైంది. ఈ ఏడాది విద్యుదుత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి జూరాలకు వరద చేరుతుండటంతో అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.

వరదపైనే ఆధారం..

ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండిన తర్వాత వచ్చే వరద జూరాల జలాశయానికి చేరుతుంది. వరద చేరితేనే ఇక్కడ విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా జలాశయానికి వరద చేరడంతో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది.

మొరాయించిన మూడో యూనిట్‌..

జూరాల ఎగువ జల విద్యుత్‌ కేంద్రంలోని మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తగా చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు రెండేళ్లుగా మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో బాగు కావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది.

● జూరాల దిగువ జల విద్యుత్‌ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ నుంచి రోజుకు 40 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 40 మెగావాట్ల ఉత్పత్తి 9,600 యూనిట్లకు సమానం. ఒక మిలియన్‌ యూనిట్‌ విద్యుదుత్పత్తికిగాను 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.

● ఈ ఏడాది దిగువ జల విద్యుత్‌ కేంద్రంలో 290 మి.యూ. లక్ష్యానికిగాను ఈ ఏడాది 447 మి.యూ.. ఎగువ జల విద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 320 మి.యూ. లక్ష్యానికిగాను 435 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు. 2014–15 నుంచి 2024–25 వరకు ఎగువన 3,039 మి.యూ., దిగువన 2,531 మి.యూ., మొత్తం 5,570 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది.

ఎగువ జూరాల పవర్‌ హౌజ్‌

దిగువ జూరాలజల విద్యుత్‌ కేంద్రం

ఏడాది వారీగా విద్యుదుత్పత్తి ఇలా..

2020–21లో జులై 14న ఉత్పత్తి ప్రారంభించి 648 మి.యూ. లక్ష్యానికిగాను 775 మి.యూ. విజయవంతంగా పూర్తి చేశారు.

2021–22లో జులై 12న విద్యుదుత్పత్తి ప్రారంభించి 724 మి.యూ. లక్ష్యానికిగాను 704 మి.యూ. ఉత్పత్తి మాత్రమే సాధించారు.

2022–23లో వరద భారీగా రావడంతో జులై 11న ఉత్పత్తి ప్రారంభించి 640 మి.యూ. లక్ష్యానికిగాను 876 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించారు.

2023–24లో జలాశయానికి స్వల్పంగా వరద చేరడంతో జులై 23న ఉత్పత్తి ప్రారంభించారు. 600 మి.యూ. లక్ష్యానికిగాను కేవలం 212 మి.యూ. ఉత్పత్తి మాత్రమే చేపట్టగలిగారు.

2024–25లో జలాశయానికి భారీగా వరద చేరడంతో జులై 18న విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 600 మి.యూ. లక్ష్యానికిగాను 678 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు.

610 మి.యూ.గాను.. 882 మి.యూనిట్లకు మించి..

ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి

2022–23లో 876 మిలియన్‌ యూనిట్లు

‘పవర్‌’ ఫుల్‌1
1/2

‘పవర్‌’ ఫుల్‌

‘పవర్‌’ ఫుల్‌2
2/2

‘పవర్‌’ ఫుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement