
పత్తిసాగులో జిల్లా మూడో స్థానం
● కపాస్ యాప్‌పై విస్తృతంగా
అవగాహన కల్పించాలి
● రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట/మక్తల్/ఊట్కూరు: రాష్ట్రంలోనే పత్తి సాగులో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నారాయణపేట మండలం లింగంపల్లిలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రైతుల నుంచి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి పండించిన రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మద్దతు ధరకు విక్రయించే విధంగా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులపై ఉందన్నారు. ము ఖ్యంగా కపాస్ యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో పత్తిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని సూచించారు. నారాయణపేట చీరలు, బంగారానికి ఎంత పేరుందో అందరికీ తెలుసని.. పంటల సాగులోనూ మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏకకాలంలో 25లక్షల మంది రైతుల రుణాలు రూ. 22వేల కోట్లను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్‌చైర్మన్ కొనంగేరి హన్మంతు, డీఎంఓ బాలమణి, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట..
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలో వివిధ గ్రామాలకు చెందిన 230 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చిన్న గోప్లాపూర్‌కు చెందిన 40మంది రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు అందజేశా రు. మక్తల్ మండలం కాచ్‌వార్ నుంచి ఎడివెల్లి వరకు రూ. 3.8 కి.మీ. మేర బీటీరోడ్డు నిర్మాణానికి రూ.2.4కోట్లతో శంకుస్థాపన చేశారు. ఊట్కూరులో పీఏసీఎస్ ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందన్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేశ్‌కుమార్, తహసీల్దార్ చింత రవి, ప్రత్యేకాధికారి యోగానంద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, నాయకులు వెంకటేశ్, విష్ణువర్ధన్‌రెడ్డి, తాయప్ప, రవికుమార్, లక్ష్మారెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, యఘ్నేశ్వర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, బస్వరాజుగౌడ్ పాల్గొన్నారు.