
‘కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ’
కోస్గి రూరల్: కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసి, దిగువ స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలకే పదవులు వరిస్తాయని ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి అన్నారు. బుధవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలకు చెందిన అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు, మహిళాధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు మాట్లాడుతూ సంఘటన సృజన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని వారి అభీష్టం మేరకు డీసీసీ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసి నివేదికను ఏఐసీసీకి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఉజ్మాజాకీర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, టౌన్ అధ్యక్షుడు తుడుం, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, బాలేష్, మాస్టర్ శ్రీనివాస్, భానునాయక్, బాల్‌రాజ్ తదితరులు ఉన్నారు.