
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి
ధన్వాడ: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించడం లేదని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు నీరటి రాఘవేందర్‌నాయుడు వాపోయారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ ఆవరణలో సమగ్రశిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తమకు కూడా వేతనాలు చెల్లించి సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లా నాయకులు వెంకట్రాములు, నారాయణచారి, గంగమ్మ, ఎస్‌ఓ జయేంద్ర, లావణ్య, రఫియా, శివమ్మ, శ్రావణి, అంజమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.