
ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
నారాయణపేట: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులును కోర్టు ఆవరణలోని జడ్జి కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లా జడ్జి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపి, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, న్యాయ–పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం, కేసులు త్వరితగతిన పరిష్కారంపై తదితర విషయాలపై చర్చించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ధన్వాడ: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో అవర్ బేస్‌డ్ టీచర్స్ (గెస్ట్ ఫ్యాకల్టీ) కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ వైశ్యాలి సూచించారు. పీజీటీ కామర్స్ 1, టీజీటీ ఇంగ్లిష్ 1 పోస్టుకు దరఖాస్తు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎంకామ్ కామర్స్, బీఈడీ, ఎంఏ ఇంగ్లిష్ అర్హత కలిగిన వారు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు తెలంగాణ మోడల్ పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలని, ఇంటర్‌ూయ్వలకు హాజరు కావాలన్నారు.
రష్యా ఎకనామిక్ సమ్మిట్‌లో మరికల్ అడ్వకేట్
మరికల్: భారత్, రష్యా, ఉబ్జెకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమానికి మరికల్‌కు చెందిన అడ్వకేట్ అయ్యప్ప హాజరయ్యారు. రష్యాలోని మాస్కో నగరంలో జరిగిన కార్యక్రమంలో భారత్ నుంచి 20 మంది బృందం పాల్గొనగా.. వారు విద్య, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులు, కార్మికుల సంక్షేమం గురించి ప్రసగించారు. బంగారు ఆభరణాల తయారీ కార్మికులు రష్యాలో అవసరం ఉన్నందున ఇక్కడికి వచ్చే భారతదేశ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రష్యా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సూచించినట్లు తెలిపారు.
నవంబర్ 16న భగవద్గీత పోటీలు
నర్వ: నవంబర్ 16న జిల్లా స్థాయి భగవద్గీత శ్లోక, కంఠస్థ, పఠన, భావ విశ్లేషణ పోటీలు నర్వ గీతభారతి పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు. మొదటి గ్రూప్ 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. రెండో గ్రూప్‌లో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. మూడో గ్రూప్‌లో 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణ పోటీలు ఉంటాయన్నారు. విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామన్నారు. విద్యార్థులు, వయోజనులు, అర్హత కలిగిన ధార్కివేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కుష్ఠు రహిత సమాజం నిర్మిద్దాం
ధన్వాడ: కుష్ఠు రహిత సమాజం కోసం వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బృంద సభ్యుడు జీఎంఓ డాక్టర్ సంపత్ అన్నారు. బుధవారం కుష్ఠు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, ఎండీటీ మాత్రలు అందజేసి చికిత్స అందించాలన్నారు. కుష్ఠువాద్యి కోసం నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ సర్వే గురించి వివరించారు. అనంతరం ఆస్పత్రిలోని రికార్డులను పరిశిలించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు డిప్యూటీ పీఎంఓ వెంకటేశ్వరచారి, సకలరెడ్డి, సురేందర్, శ్రీనివాస్, డాక్టర్ అనుష, సాయిసింధురాజ, కథలప్ప, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ