
అల్పాహారం అందించాలి
అదనపు తరగతులు నిర్వహిస్తుండడంతో సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాం. ఆకలిగా ఉండడంతో ప్రభుత్వం, దాతలు సహకరించి అల్పాహారం, స్నాక్స్ అందిస్తే బాగుంటుంది.
– కృష్ణవేణి, విద్యార్థిని, షేర్నపల్లి
ప్రత్యేక తరగతులు ఉపయోగకరం
రెగ్యులర్ తరగతుల్లో బోధించిన విషయాలను నివృత్తి చేయడానికి సాయంత్రం వేళలో నిర్వహించే అదనపు తరగతులు ఎంతో ఉపకరిస్తున్నాయి. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించడానికి ఆస్కారం ఉంది. అభ్యాస దీపికలు విద్యార్థులకు మరింత తోడ్పాటుగా ఉన్నాయి. – శ్రీనివాస్,
ఉపాధ్యాయుడు, నిడ్జింత జెడ్పీ స్కూల్
మెరుగైన ఫలితాల సాధనకు కృషి
టెన్‌లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అభ్యాస దీపికలు వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. 100 శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా సర్దుబాటు చేశాం. పిల్లల్లో భయాన్ని పోగొట్టి పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం.
– గోవిందరాజు, డీఈఓ, నారాయణపేట
●

అల్పాహారం అందించాలి