
కొనసాగుతున్న మద్యం టెండర్ల దాఖలు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ కొనసాగుతుంది. మొత్తం 227 ఏ4 దుకాణాలకు గాను గత నెల 26 నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 508 టెండర్లు వచ్చాయి. ఇందులో మంగళవారం 53 దరఖాస్తులు వచ్చాయి. కాగా.. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.15.24 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి భారీ మొత్తంలో టెండర్లు వేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్వల్పంగా వేసిన వ్యాపారులు రాబోయే మూడు రోజుల్లో భారీగా వేయడానికి సిద్ధపడుతున్నారు.