
‘రక్షా’నుబంధం
నేడు రక్షాబంధన్ వేడుకలు
● సోషల్
మీడియాలోనూ
శుభాకాంక్షల వెల్లువ
● ఆధునిక కాలంలోనూ ఆదరణ తగ్గని వైనం
● ప్రేమానుబంధాలను
చాటుతున్న
రాఖీ పండుగ
● కొరియర్ల ద్వారా
తమ వారికి రాఖీలు
పంపిస్తూ సంబరం
అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేదే రాఖీ పండుగ. సోదరి
తన సోదరుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే.. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో నానాటికి బంధాలు చెదిరిపోతున్న తరుణంలో రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధాలను బలోపేతం చేస్తుంది. సోదర, సోదరీమణుల మధ్య ఉండే అనుబంధాలు.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలుస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు సైతం కొరియర్‌లోనూ తమవారికి రాఖీలు పంపిస్తూ.. అనుబంధాలను చాటి చెబుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగాంలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
– స్టేషన్ మహబూబ్‌నగర్/ అచ్చంపేట
400 ఏళ్ల పండుగ
రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ.
గాయత్రీ మాలధారణ..
పత్తితో తయారు చేసిన ధారంతో కంకణం ధరించడమే కాకుండా.. జంధ్యం (గాయత్రిమాల)కూడా ధరిస్తారు. ముందుగా గాయత్రి హోమం నిర్వహించిన తర్వాత పద్మశాలీలంతా నూలుతో తయారు చేసిన జంద్యాలను 43 ఏళ్లు సామూహికంగా ధరిస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. స్థానిక భక్తమార్కండేయ ఆలయంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం 44వ నూలు పూర్ణిమకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరికల్‌లో రాఖీ ఆకారంలో కూర్చున్న విద్యార్థులు
మార్కెట్లో వివిధ డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. ముఖ్యంగా అన్నయ్య, తమ్ముడు పేర్లతో వచ్చిన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులకు సంబంధించి వినూత్నంగా రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. అదేవిధంగా మెటల్, కుందన్, ప్రింటెడ్, హ్యాండ్‌మేడ్, వుడన్, ఫ్యాషన్ బోటిక్, యాక్ససిరీస్, మోటోపట్లు తదితర రకాల రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. లైట్ వెయిట్‌తో ఉన్న రాఖీల నుంచి కొంతమేర పెద్దసైజు గల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లను బట్టి రూ.10 నుంచి రూ.500 వరకు రాఖీలు లభిస్తున్నాయి.
జిల్లాకేంద్రానికి చెందిన చిట్టెమ్మ 1997లో మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా నియామకమైంది. తనకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగను తోటి కండక్టర్లు, డ్రైవర్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే ఏడాది నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించింది. డిపోలోని దాదాపు 220 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి కులమతాలకతీతంగా రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుతోంది. రాఖీపండుగ వచ్చిందంటే డిపోలోని అందరూ చిట్టెమ్మ కట్టే రాఖీ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రాఖీలు కడతానని, రిటైర్డ్ అయ్యే వరకు రాఖీ పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా డిపోలోని ఉద్యోగులందరికి రాఖీలు కడతానని పేర్కొన్నారు.
28 ఏళ్ల నుంచి..

‘రక్షా’నుబంధం

‘రక్షా’నుబంధం

‘రక్షా’నుబంధం