ప్రజా పంపిణీపై పర్యవేక్షణేది? | - | Sakshi
Sakshi News home page

ప్రజా పంపిణీపై పర్యవేక్షణేది?

Jul 23 2025 5:40 AM | Updated on Jul 23 2025 5:40 AM

ప్రజా

ప్రజా పంపిణీపై పర్యవేక్షణేది?

నర్వ: ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు బియ్యం.. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. అంగన్‌వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరుకులు.. అందజేస్తుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందా.. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఏర్పడుతున్నాయా.. ఎవరైన ఇబ్బందులు పెడుతున్నారా.. ఇలా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే విజిలెన్స్‌ కమిటీల లక్ష్యం. అయితే, ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణ కోసం జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన నేపథ్యంలో గత రెండేళ్లుగా వీటిని పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేయడంలేదు అనే ఆరోపణలున్నాయి. కొత్త జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటును పూర్తిచేయడంలో అధికారులు తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఈ కమిటీలు నేటికి ఏర్పాటు కాలేకపోవడంతో ఎలాంటి సమావేశాలు నిర్వహించక పోవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణ లేక గాడితప్పుతుందని ప్రజల నుంచి ఆరోపణలున్నాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేదెలా..

క్షేత్రస్థాయిలో విజిలెన్స్‌ కమిటీల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఒకే దేశం.. ఒకే రేషన్‌ విధానం అమలులో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వారికి రేషన్‌ బియ్యం అందడం లేదు. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం గురించి ప్రశ్నించేవారు కరువయ్యారు. క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఆసక్తి చూపుతారు. సమావేశాలు నిర్వహించకపోవడంతో సమస్యలను గుర్తించినా ప్రయోజనం ఉండటం లేదు. మూడు నెలలకోసారి విజిలెన్స్‌ కమిటీ సమావేశాలు ఏర్పాటు నిర్వహిస్తే సమస్యలు కొన్ని అయినా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలోని 13 మండలాల్లో 280 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో జిల్లా వ్యాప్తంగా ఎఫ్‌ఎస్‌సీ కార్డులు 1,30,736 కార్డులుండగా ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 9,401, ఏఏపీ కార్డులు 30.. మొత్తం 1,40,217 కార్డులున్నాయి. వీరికి ప్రతి నెల 323 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో 300 మందికి పైగా డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల ఇందుకుగాను 15వ తేది వరకు బియ్యం తీసుకునేందుకు గడువు ఉంటుంది. గతంలో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందజేసేవారు. ఇప్పుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. బియ్యం పంపిణీలో ఏమైన సమస్యలుంటే విజిలెన్స్‌ కమిటీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి.

త్వరలో నూతన కమిటీల ఏర్పాటు

విజిలెన్స్‌ కమిటీల నియామకం కాస్త ఆలస్యమైంది. త్వరలో జిల్లా విజిలెన్స్‌ నూతన కమిటీని ఏర్పాటుచేస్తాం. ఆ తర్వాత డివిజన్‌, మండలాల స్థాయిలో విజిలెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా ప్రజలకు సేవలు అందే విధంగా చూస్తాం. – వంగాల బాలరాజు, డీఎస్‌ఓ

ప్రతి మూడు నెలలకోసారి సమావేశం

విజిలెన్స్‌ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. రేషన్‌ బియ్యం నాణ్యత, పంపిణీ తీరు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై చర్చించాలి. లోపాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతో సదుద్ధేశంలో అమల్లోకి తీసుకొచ్చిన విజిలెన్స్‌ కమిటీల నిర్వహణ నామమాత్రంగానే మారింది. గత రెండేళ్ల కిందట సమావేశాలు నిర్వహించగా ఆ తర్వాత వాటి ఊసేలేదు.

జిల్లాలో పూర్తికాని

విజిలెన్స్‌ కమిటీల ఏర్పాటు

మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ఊసేలేని కమిటీల నియామకం

జిల్లాలో 1,40,217 రేషన్‌ కార్డులు

ప్రజా పంపిణీపై పర్యవేక్షణేది?1
1/1

ప్రజా పంపిణీపై పర్యవేక్షణేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement