
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం
మక్తల్: సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన భూత్పూర్, నేరడ్‌గాం గ్రామ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, త్వరలో ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లకు స్థలాలు గుర్తించి ఏర్పాటుచేస్తామని పశుసంవర్ధక, క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడుతో కలిసి మంత్రి ముంపు గ్రామాలైన భూత్పూర్, నేరెడ్‌గాంను సందర్శించారు. గ్రామా ల్లో ఊట నీటితో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను, నిత్యం పాములు, తేళ్లు ఇళ్లలో సంచరించడం, గ్రా మస్తుల పరిస్థితిని వారు ప్రత్యక్షంగా పరిశీలించా రు. ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్‌కు మంత్రి తెలిపారు. ఈక్రమంలోనే ఓ ఇంటి వద్ద పాము కనిపించడంతో అంద రూ భయభ్రాంతులకు లోనయ్యారు. ఈక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇళ్లలో నీటి ఊట, పాములు, తేళ్లు, విష పురుగులు రావడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని వాపోయారు. 2005 సంవత్సరంలో భూత్పూర్ రిజర్వాయర్ ఏర్పాటు చేయగా దాదాపు 2వేల ఎకరాల భూము లు రైతులు కోల్పోవడం జరిగిందని, అప్పట్లో కేవ లం రూ.50వేలు ఎకరాకు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొన్నారని వాపోయారు. జీఓ విడుదలై 15 ఏళ్లు గడిచినా నేటి వరకు సమస్యలు పరిష్కరించలేదని, త్వరగా ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ కోసం స్థలం చూపించి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తారు, పోతారు తప్పా ముంపు గ్రామాల ప్రజల సమస్యలను మా త్రం ఎవరూ పరిష్కరించడంలేదని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రెండు ముంపు గ్రామాల సమస్యలను స్వయంగా తెలుసుకొనేందు కే గ్రామాలను సందర్శించామని, ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ ఏర్పాటుకు, స్థలం ఇతర విషయాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసాఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్‌నా యక్, తహసీల్దార్ సతీష్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటే ష్, కుర్మయ్యగౌడ్, చెన్నయ్యగౌడ్, రాఘవేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, బీంసేన్‌రావ్ పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడుతో కలిసి ముంపు గ్రామాల సందర్శన