
అతిథి అధ్యాపకపోస్టులకు దరఖాస్తులు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫిజిక్స్, మాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులను బోధించుటకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్వేత మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, బీఈడీ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తులను నారాయణపేట కేజీవీబీలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు అందించాలని ప్రిన్సిపల్ తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నం.9912989334 సంపదించాలని, జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోస్టులకు అర్హులని పేర్కొన్నారు.
నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
నారాయణపేట రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహ కార్యదర్శి సాయికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు నరహరి కోరారు. విద్యారంగ సమస్యల సాధనకు చేపడుతున్న బంద్‌కు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించాలని కోరారు.
బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి
నారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చిన కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ రాష్ట నేత, హైదరాబాద్ మున్సిపల్ మాజీ మేయర్ బండా కార్తీకా రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ 11ఏళ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థులను గెలిపించేలా కృషి చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొండా సత్య యాదవ్, సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో 24వ తేదీ (గురువారం)న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అఽధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలో 500 ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మళ్లీ కనిపించిన చిరుత
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు పట్టణ ప్రజలను చిరుత భయబ్రాంతులకు గురిచేస్తోంది. అటవీశాఖ, పోలీసు బృందాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీం రెండు బోన్‌లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నా చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. గత నెల 30న కనిపించిన చిరుత తరచుగా గుట్టపై ఉన్న గుండ్లు, బండరాళ్లపై తిరగాడుతూ కనిపిస్తోంది. పోలీసులు, అటవీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఏమాత్రం దొరకడంలేదు. కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి స్వయంగా గుట్టపైకి ఎక్కి చిరుత సంచారాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి గాలింపు చేపడుతున్నా బోనుకు చిక్కడం లేదు. తాజాగా మంగళవారం సాయంత్రం టీడీగుట్ట ఫైర్‌స్టేషన్ ఎదురుగా గుట్టపై చిరుత కనిపించడంతో స్థానికులు వెంటనే అటవీ, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఎఫ్‌ఓ రాంబాబు, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, సీఐ అప్పయ్య సిబ్బందితో అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షించారు. అప్పటికే చిరుత తప్పించుకోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. చిరుతను చూసేందుకు కోస్గి రోడ్డుపై జనం గుమిగూడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.టీడీగుట్ట పరి సర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాల ని ఆటోల ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు.

అతిథి అధ్యాపకపోస్టులకు దరఖాస్తులు