
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
అచ్చంపేట: ప్రముఖ కవి ఎంఏ గఫార్ రచించిన కాలగమనం పుస్తకాన్ని ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రముఖ కవి, వక్త, సాహితీవేత్త నాగేశ్వరం శంకరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఏ గఫార్ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగులో కవిగా రాణించడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో నల్లమల రత్నాలు, ప్రజాప్రస్థానం, మేలుకొలుపు తదితర రచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మకట శతకంలో వచన కవిత్వాన్ని రచించడం చాలా అరుదు అని.. అలాంటి వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆయన ముందు వరుసలో ఉంటారన్నారు. ఇలాంటి కవులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవులను డాక్టర్ బాలనారాయణ శాలువాలతో సన్మానించారు. కవులు వల్లభాపురం జనార్దన్, కర్నాటి రఘురాములుగౌడ్, ముచ్చర్ల దినకర్, వనపట్ల సుబ్బయ్య, సాయిజ్యోతి, కాటమరాజు నరసింహులు, ఎదురవల్లి కాశన్న, ఖాజా మైనొద్దీన్, కందికొండ మోహన్ పాల్గొన్నారు