
అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
మక్తల్/నర్వ: అన్నివర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి మంత్రి వాకిటి 200మంది ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అనంతరం న్యాక్ ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ పూర్తిచేసుకున్న 35మంది మహిళలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య లిమిటెడ్ పెద్దజట్ర ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి పనులకు రూ. 600కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమన్నారు.
● జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రస్థాయి ఖేల్ ఇండియా సైక్లింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఊట్కూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను ఆయన శాలువాతో సత్కరించి అభినందించారు. జిల్లా క్రీడాకారులకు ప్రోత్సా హం అందిస్తున్న రిటైర్డ్ పీఈటీ గోపాలానికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
● నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 140 మందికి సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. అదే విధంగా మక్తల్ మండలం మంథన్‌గోడు గ్రామానికి చెందిన కురుమూర్తి ఇటీవల విద్యుదాఘాతంతో మృతిచెందగా.. అతడి కుటుంబానికి మంజూరైన రూ. 5లక్షల చెక్కును మంత్రి అందజేశారు.
● గ్రామీణ ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకొని మత సామరస్యాన్ని చా టాలని మంత్రి వాకిటి అన్నారు. నర్వ మండలం లంకాల్‌లో కౌడీపీర్ల (చిన్నపీర్ల)ను ఆయన దర్శించుకున్నారు. ముందుగా పీర్లకు చాదర్, పూలు, దట్టీలు సమర్పించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అదికారి రషీద్, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లక్ష్మారెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎల్కో టి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, హాజమ్మ, జగన్మోహన్‌రెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్‌రెడ్డి, బీసం రవికుమార్, వేణుగౌడ్ పాల్గొన్నారు.
ప్రతి పేద కుటుంబం
సొంతింటి కలను నెరవేరుస్తాం
రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ
మంత్రి వాకిటి శ్రీహరి