
డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న సెమిస్టర్– 2, 4, 6కు సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్‌లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి: డీకే అరుణ
మిడ్జిల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం మిడ్జిల్‌లో తన ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ గార్డెన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో కాంగ్రెస్ తమ పథకాలు అని చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని, దీనిపై కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాజేశ్వర్, తిరుపతి, నరేష్‌నాయక్, లాలు, రవిందర్ పాల్గొన్నారు.
18న సీఎం పర్యటన
పెంట్లవెల్లి: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో 22 ఎకరాలలో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. కాగా.. సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. సమయం లేనందున అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారుల కు సూచించారు. మంగళవారం మంత్రి జూ పల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలో గా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు.
17న జాబ్ మేళా
వనపర్తి: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో వనపర్తిలోని పీఎంకేకేలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి పది, ఐఐటీ, ఏదైనా డిగ్రీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని.. ఆసక్తిగల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించిరు. వివరాలకు 99485 68830, 91753 05435, 77990 73053 నంబర్లను సంప్రదించాలన్నారు.
కొనసాగుతున్న
నీటి విడుదల
మదనాపురం: రామన్‌పాడు జలాశయం నుంచి సోమవారం సాగునీటి సరఫరా కొనసాగుతుందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టులో 1,019 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 873 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని తరలించినట్లు వివరించారు.

డిగ్రీ ఫలితాలు విడుదల