
వ్యాధుల భయం
పారిశుద్ధ్య లోపం..
●
ఫాగింగ్ చేయాలి
గ్రామాల్లో దోమల నివారణకు విధిగా ఫాగింగ్ చేయాలి. గ్రామాల్లో దోమకాటుతో జ్వరాల భారిన పడుతున్నారు. వైద్యాధికారులు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి రోగాల భారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. – లక్ష్మణ్, ముస్లాయిపల్లి
డ్రెయినేజీలు నిర్మించాలి
దోమల విజృంభణకు కారణమైన మురుగును ఇళ్ల మధ్య నిల్వ ఉండకుండా, పారకుండా డ్రెయినేజీలు నిర్మించాలి. ప్రభుత్వం డ్రెయినేజీ నిర్మాణాలకు అరకొర నిధులు మంజూరు చేస్తుండటంతో ఎక్కడా పూర్తి స్థాయి డ్రెయినేజీలు నిర్మించలేకపోతున్నారు. అధికారులు స్పందించి డ్రెయినేజీలు నిర్మించాలి.
– కిరణ్, మక్తల్
దోమల నివారణకు చర్యలు
మురుగు రోడ్లపై ప్రవహించకుండా డ్రెయినేజీలు నిర్మిస్తాం. మురుగు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్‌ను చల్లడంతోపాటు దోమల నివారణకు విధిగా ఫాగింగ్ చేపట్టేలా పంచాయతీ కార్యదర్శులను ఆదేశిస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే డ్రెయినేజీలు నిర్మిస్తాం.
– రమేష్, ఎంపీడీఓ, మక్తల్
మక్తల్: నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజల్లో సీజనల్ వ్యాధుల భయం పట్టుకుంది. అడపాదడపా వర్షాలతో చాలా గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగుతో వర్షపు నీరు చేరి రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ కారణంగా రోడ్లపై ఉన్న మురుగు కుంటలు దోమల వృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. పారిశుద్ధ్య లోపం కారణంగా వ్యాధులు ప్రబలుతుండడం సమస్యగా మారుతోంది
దోమల దండయాత్ర
నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వలో రోజు రోజుకు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగియడం.. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువవడం.. శానిటేషన్ నిధులు సక్రమంగా వినియోగించకపోవడం.. పారిశుద్ధ్య పనులు పడకేయడంతో రాత్రి అయ్యిదంటే చాలు దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఏ పని చేయాలన్నా కార్యదర్శులు చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
● మాగనూర్, వర్కూర్, గుడేబల్లూర్, నేరడ్‌గాం, సూకూర్‌లింగంపల్లి, కృష్ణా, మందిపల్లి, వడ్వాట్, ముడుమాల్, తంగిడి, అడవిసత్యావార్, గురజాల గ్రామాల్లో దోమల తీవ్రత ఎక్కువగా ఉందని అయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
● ఊట్కూర్ మండంలోని మల్లేపల్లి, చిన్నపోర్ల, పెద్దపోర్ల, పులమామిడి, నిడుగుర్తి, తిప్రాస్‌పల్లి, వల్లంపలి, ఓబ్లాపూర్ల్ ఆయా గ్రామాల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక కాల్వల్లో మురుగు నిలిచి దోమలు అంతకంతకూ రెట్టింపవుతున్నాయి.
● మక్తల్ మండలంలోని సోమేశ్వర్‌బండ, కర్ని, అనుగొండ, గుడిగండ్ల, జక్లేర్, మంతన్‌గోడ్, సామాన్‌పల్లి, దాదాన్‌పల్లి, కాచ్‌వార్, టెకులపల్లి, సత్యవార్, గుడిగండ్ల, జక్లేర్, ముస్లాయిపల్లి, లింగంపల్లిలో పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టకపోవడం, వర్షాలు కురుస్తుండడంతో ఇళ్ల మధ్య మురుగు కుంటలు ఏర్పడుతున్నాయి. పందులు ఇవే ఆవాసాలుగా చేసుకొని స్వైర వివాహరం చేస్తుండడంతో అటుగా వెళ్లాలంటేనే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
● నర్వ మండంలోని లంకాల, యాంకి, పాతర్‌చేడ్, నర్వ, పెద్దకడ్మూర్‌లో డ్రైనేజీ కాల్వలు సరిగా తీయడంలేదని దీంతో మురుగుకాల్వలు పూడుకపోయి మురుగు రోడ్లపైనే ప్రవహిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అధికారులు సక్రమంగా పనులు చేపట్టడంలేదని, వైద్యసిబ్బంది సైతం గ్రామాల్లో క్లోరినేషన్ దోమల నివారణకు ఫాగింగ్ చేయడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో ఫాగింగ్ నిర్వహించి దోమలను అరికట్టాలని, పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
కాల్వలు, నీటి గుంతల్లో దోమల విజృంభణ
కానరాని ఫాగింగ్
పెరుగుతున్న జ్వర బాధితులు

వ్యాధుల భయం

వ్యాధుల భయం

వ్యాధుల భయం