
‘పార్టీ కాదు.. పేదరికం చూసి ఇళ్లు ఇస్తాం’
మక్తల్/కృష్ణా/ఊట్కూర్/మాగనూర్: పార్టీని చూసి కాదు.. పేదరికాన్ని చూసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని పశుసంవర్ధక, క్రీడల యువజన, మత్స్యసహకార, డెయిరీ పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌లోని కేశవనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మక్తల్‌లో దోబీ ఘాట్ వద్ద రోడ్‌డ్యాంను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు.
ఆలయ అభివృద్ధికి కృషి
శ్రీపడమటి అంజనేయస్వామి ఆలయ అబివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఆలయ ధర్మకర్తగా ప్రాణేష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేపట్టగా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అందజేసి ప్రాణేష్‌కుమార్‌కు మంత్రి నియామకపత్రం అందించారు.
● సంగంబండ రిజర్వాయర్ వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని మంత్రితో పాటు స్టేట్ ఫిషరీస్ స్టేట్ డైరెక్టర్ నిఖిల్ పరిశీలించారు.
● ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి కొత్తపల్లికి రూ.1.90 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు, రూ. 20లక్షలతో నిర్మించే అవులోనిపల్లిలో గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి భూమిపూజ చేపట్టారు. బిజ్వార్ నుంచి పెద్దపోర్ల గ్రామానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఫార్మేషన్ రోడ్డు పనులు చేపట్టాలని ఎంపీడీఓ ధనుంజయగౌడ్‌కు ఆదేశించారు. బిజ్వారంలో రైతు రుణమాఫీ జాబితా ఏర్పాటు చేయకపోవడంపై పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
● కృష్ణా మండలంలోని గుర్జాల్ గ్రామానికి రూ.2.60 కోట్లతో ఏర్పాటు చేసే బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
● మాగనూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెగడబండ వరకు గ్రామ సమీపం వరకు రూ.3.80 కోట్లతో 4 కిలోమీటర్ల బీటీరోడ్డు నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శంకర్‌నాయక్, తహసీల్దార్లు చింత రవి, సతీష్‌కుమార్, పీఆర్ ఈఈ హీర్యానాయక్, ఏఈ అజయ్‌రెడ్డి, ఈఓ సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, గణేష్‌కుమార్, ఆనంద్‌గౌడ్, సూర్యప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.