
చివరలో మొండిచేయి..!
‘ఇందిరమ్మ’ఆశావహులనువెంటాడుతున్న గతం
● 20 ఏళ్ల క్రితం లబ్ధిపొందారంటూఅనర్హులుగా తేల్చివేత
● అర్హులుగా చేర్చి.. ప్రొసీడింగ్‌లు సిద్ధమైన తర్వాత రద్దు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగాఆందోళనలో వేలాది మంది..
● అప్పట్లో ఈ పథకంలో భారీ స్కాం.. పలువురు నేతల స్వాహా పర్వం
● తమకు తెలియకుండానే బిల్లులు మింగారని లబ్ధిదారుల గగ్గోలు
● ఆ జాబితా ప్రకారం ఏరివేయడంపై మండిపాటు
ఈ ఫొటోలోని మహిళ పేరు కళావతి. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న ఆమె ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇల్లు వస్తుందని ఓ కాంగ్రెస్ నాయకుడు హామీ ఇవ్వడంతో ధీమాగా శిథిలావస్థకు చేరిన ఇంటిని కూలగొట్టుకుంది. ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమైన క్రమంలో సదరు నేత నీకు ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పడంతో కంగుతింది. అధికారుల చుట్టూ తిరిగిన క్రమంలో గతంలో నీ పేరిట ఇందిరమ్మ పథకం కింద ఇల్లు
మంజూరైందని.. బిల్లులు కూడా డ్రా చేసుకున్నారని తేల్చేశారు. ఇప్పుడు ఈ పథకం నీకు వర్తించదని చెప్పడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో ఉన్న గూడును కూల్చుకున్నానని.. ఇప్పుడేం చేయాలో తోచడం లేదని ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకుంది.
కూలగొట్టిన
ఇంటి వద్ద కళావతి

చివరలో మొండిచేయి..!