
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 30 అర్జీలు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మండల ప్రత్యేకాధికారులు విధిగా తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.