
ట్రాన్స్‌కో అధికారుల లీలలు
నారాయణపేట
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
వివరాలు 8లో u
కోస్గి: విద్యుత్ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు తమ బినామీలతో విద్యుత్ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తగా.. మరికొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందినంత దండుకుంటున్నారు. జిల్లా విద్యుత్ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. డీఈ, ఎస్‌ఈ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉన్నతాధికారుల కంటే కార్యాలయ బాధ్యతలు నిర్వహించే అధికారులదే హవా కొనసాగుతోంది.
బయటపడిన వ్యవహారం
కోస్గి పట్టణ పరిధిలో నూతనంగా వెలుస్తున్న డీటీసీపీ వెంచర్లలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని యజమానులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓ వెంచర్ యజమాని విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుం చెల్లించి ట్రాన్స్‌ఫార్మన్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. కాగా అధికారులు వెంచర్‌లో విద్యుత్ పనులను తాము సూచించిన వ్యక్తికే అప్పగించాలని అనధికారిక షరతు విధించారు. సదరు కాంట్రాక్టర్‌కు జిల్లా కార్యాలయంలో పలుకుబడి ఉందని, ఇతర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తే ఇబ్బంది అవుతుందని పరోక్షంగా హెచ్చరించారు. కానీ వెంచర్ యజమాని వేరే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాడు.
కోస్గి సబ్‌స్టేషన్
అంచనా వ్యయం పెంచుతూ..
దరఖాస్తు చేసుకున్న వెంచర్‌లో స్థానిక ఏఈ వెంకటేష్, లైన్‌మెన్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి కావాల్సిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం, ఇతర అంశాల అంచనా వ్యయంతో నివేదికను డీఈకి, అక్కడి నుంచి ఎస్‌ఈకి పంపిస్తారు. అధికారులు ఏఈలు పంపిన నివేదికలను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కోస్గి ఏఈ స్వయంగా పరిశీలించి 2 ఎకరాల్లో ఏర్పా టు చేసిన వెంచర్‌కు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ సరిపోతుందని అధికారికంగా నివేదిక అందజేశారు. కానీ జిల్లా కార్యాలయంలో అనుమతుల వ్యవహారాన్ని పర్యవేక్షించే అధికారి 63కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పా టు చేసుకోవాలని అనుమతులు మంజూరు చేశా రు. ఇదే విషయమై డీఈ నర్సింహారావును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాంట్రాక్టర్లతో కుమ్మ క్కైన విద్యుత్ అధికారుల వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.
25 కేవీ సామర్థ్యమే ఎక్కువ
వెంచర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న ప్లాట్లకు 25 కేవీ సామర్థ్యం కూడా ఎక్కువే. అయినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొంచెం ఎక్కువగా ఉండాలని 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ సిఫారసు చేస్తూ నివేదిక పంపాను. జిల్లా కార్యాలయం నుంచి అంచనా వ్యయం మారుస్తూ 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు. ఈ విషయం మరోమారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
– వెంకటేష్, ఏఈ, కోస్గి
డీఈ మార్చమంటేనే..
సంబంధిత వెంచర్‌లో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ అవసరం అని ఏఈ నివేదిక అందజేశారు. కానీ డీఈ సూచించడంతో ట్రాన్స్‌ఫార్మన్ సామర్థ్యం పెంచి అనుమతులు మంజూరు చేశాం. దీనిపై అనుమానం ఉంటే డీఈతోనే మాట్లాడండి. – వెంకట కృష్ణారెడ్డి,
ఎస్‌ఈ కార్యాలయ అధికారి
నెలలుగా కాలయాపన..
విద్యుత్ ఏర్పాటు కోసం ఈ ఏడాది జనవరి 24న దరఖాస్తు చేసుకోగా అధికారులు మాత్రం కాలయాపన చేస్తూ వచ్చారు. తమ బినామీ కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వలేదని ఆగ్రహంతో అధికారులు 6 నెలలుగా ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచారు. ఇదే విషయమై సదరు యజమాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధం కావడంతో పాటు దరఖాస్తు తీసుకున్నట్లు ధ్రువీకరణ అడగడంతో అధికారులు తమదైన శైలిలో విద్యుత్ ఏర్పాటుకు మంజూరు పత్రం అందజేశారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
వెంచర్లలో తమ బినామీలకు పనులు దక్కేలా యజమానులపై ఒత్తిడి
మాట వినకుంటే ‘విద్యుత్’ అనుమతుల్లో జాప్యం

ట్రాన్స్‌కో అధికారుల లీలలు

ట్రాన్స్‌కో అధికారుల లీలలు

ట్రాన్స్‌కో అధికారుల లీలలు