నారాయణపేట ఎడ్యుకేషన్: మహిళలు, యువతులు, చిన్నారులను వేధిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని షీటీం పోలీసులు అన్నారు. బుధవారం నారాయణపేట మండలం, కోటకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సమ్మర్ క్యాంప్‌లోని విద్యార్థులకు షీ టీం సభ్యులు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, అందరూ సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహిలలను, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా ఎవరైనా వేధించిన ధైర్యంగా షీ టీమ్ పోలీస్‌ల నెంబర్ 8712670398 కి సమాచారం అందించాలని, వేధించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళా సైబర్ మెసానికి గురైతే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో షీ టీమ్ పోలీసులు జ్యోతి, కవిత, ఉపాద్యాయులు, విద్యార్తులు పాల్గొన్నారు.

వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి