
వాహనాలను కండీషన్‌లో ఉంచుకోవాలి
నారాయణపేట: జిల్లా పోలీస్ స్టేషన్లలో పెట్రోల్ కార్ విధులు నిర్వర్తించే వాహన డ్రైవర్లు వాహనాలను కండీషన్‌లో ఉంచుకోవాలని ఎంటీఓ ఆర్‌ఎస్‌ఐ శివశంకర్ సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయ ఆవరణలోని ట్రైనింగ్ సెంటర్‌లో జిల్లాలోని పోలీస్ మోటార్ వాహన డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి పెట్రోలింగ్ చేసే సమయంలో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్విరామంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరస్థులపై నిఘా ఉంచాలని, ముందస్తు నేరాలు జరగకుండా సైరన్ వేసుకుంటూ పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. వాహనాలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మెకానిజంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహనాన్ని ప్రతిరోజు శుభ్రపరస్తూ కండిషన్‌లో ఉంచుకోవాలని సమయానికి అయిల్ సర్విసింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సమయంలో పైఅధికారులకు వాహనాన్ని అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు మోటారు వాహన డ్రైవర్లు, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.