● టీబీ బోర్డు సెక్రటరీ
రామకృష్ణారెడ్డి
హొళగుంద: తుంగభద్ర డ్యాం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తి దశకు చేరాయని, త్వరలో ట్రయల్ రన్ చేయనున్నట్లు తుంగభద్ర బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్‌డీఓలు, సెక్షన్ ఆఫీసర్లతో కలిసి తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై శనివారం ఆయన పర్యటించారు. హొళగుంద సెక్షన్ 183 కి.మీ పరిధిలో పర్యాటిస్తూ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని గుడుదూరు, మరికొన్ని చోట్ల కాలువలో పూడిక తీత, వంతెన ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. అవి పూర్తయితో బళ్లారికి నీటిని విడుదల చేస్తామన్నారు. హొళగుంద సెక్షన్‌లో 184 కి.మీ, 193 కి.మీ వద్ద కాలువ ఎడమ గట్టు అధ్వానంగా ఉందని, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తే పనులు చేపడతామన్నారు. ఆయన వెంట టీబీ బోర్డు అధికారులు సునీల్, మృత్యుంజయనాయక్, జడేష్, ఉషా, శ్రీకాంత్‌కుమార్ ఉన్నారు.


