నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో గత ఏడాది జూలై నెల నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడిచేది. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు తిరుపతికి వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరుంగా ఉండేది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక రైలును రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుపతి ఒకే రైలు ఉండటంతో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. – డీసీ ఉసేన్, కోవెలకుంట్ల
నంద్యాల నుంచి రేటిగుంట వరకు ప్రస్తుతం ఒకే డెమో రైలు నడుస్తోంది. ఈ రైలు ఉదయం 6.45 గంటలకు కోవెలకుంట్లకు చేరుకుంటుంది. ఈ రైలు వెళ్లిన తర్వాత రాత్రి వరకు రైళ్ల రాకపోకలు లేవు. ఇదే సమయంలో రేణిగుంట నుంచి నంద్యాలకు మరో ప్యాసింజర్ రైలు నడిపితే ప్రయాణికులకు అన్ని విధాలా రైలు ప్రయాణం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలి.
– రాజేశ్వరరెడ్డి, జోళదరాశి గ్రామం, కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గం లో రైళ్ల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండటంతో రెండు జిల్లాల ప్రయాణికులు అవస్థలు పడుతు న్నారు. ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిమీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపా డు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగాన పల్లె, మద్దూరు, నంద్యాలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని 2016 ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంత పురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఈ మార్గంలో డెమో రైలు మినహా మిగిలిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాత్రి వేళల్లో మాత్రమే తిరుగుతుండటం, ఇటీవలే ఒక ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడంతో ప్రజలకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. ఎనిమిది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి నంద్యాల మీదు గా తిరుపతికి ప్రత్యేక రైలు తిరుగుతుండేది. నాందేడ్ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, పిడుగురాళ్ల, మార్కాపురం, నంద్యాలకు గురువారం ఉదయానికి నంద్యాల చేరుకుని అక్కడి నుంచి బనగానపల్లె, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా తిరు పతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.40 గంట లకు నంద్యాలకు చేరుకునేది. ఈ ప్రత్యేక రైలును మార్చి 1వ తేదీ నుంచి రద్దు చేయడంతో ఈ మార్గం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లుకు మాత్రమే పరిమితమైంది. నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల రాకపోకలను పెంచాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నా రైల్వేశాఖ రైళ్ల పెంపును కంటితుడుపుగా చేపడుతోంది. ఉన్న రైలును రద్దు చేయడం, ప్రస్తుతం నడుస్తున్న తిరుపతి రైలుకు కోవెలకుంట్లలో శాశ్వత స్టాపింగ్ లేకపోవడంతో రైల్వేశాఖ ఆరు నెలలకొకసారి స్టాపింగ్ ప్రక్రియను రెన్యువల్ చేయాల్సి వస్తోంది. రైల్వే అధికారులు ఏమాత్రం అనుమతి నిరాకరించినా ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు కోవెలకుంట్లలో స్టాపింగ్ ఉండదు. నిత్యం వందల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైల్వే అధికారులు పగటి వేళ్లలో ఈ మార్గంలో రైళ్లను నడపకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
● తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును కడప నుంచి నంద్యాల వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉన్నా ఆ రైలును నంద్యాలకు కాకుండా అనంతపురం జిల్లా గుంతకల్లు వరకు పొడిగించడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాశలయ్యాయి.
● ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురంకు కొత్తగా ప్యాసింజర్ రైలును మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రైలు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా కడప వరకు ఉంటుందని ప్రజలు భావించారు. అలా కాకుండా నంద్యాల నుంచి మార్కాపురానికి మార్చడంతో ప్రజలకు నిరాశే మిగిలింది. ఆరు నెలలు గడిచినా గుంతకల్లు– మార్కాపురం రైలు పట్టాలెక్కలేదు.
● ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వ్యాపించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించలేదు.
నాందేడ్ – నంద్యాల–
తిరుపతి రైలు రద్దు
ఎర్రగుంట్ల రైల్వేమార్గంలో
పట్టాలెక్కని ప్రతిపాదన రైళ్లు
అరకొరగా నడుస్తున్న రైళ్లలో
కిక్కిరిసి ప్రయాణం
రెండు జిల్లాల ప్రయాణికులకు
తప్పని నిరీక్షణ


