శ్రీశైలంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో భక్తుల రద్దీ

Apr 5 2026 9:06 AM | Updated on Apr 5 2026 9:06 AM

పత్తి క్వింటా రూ.9 వేలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆల య క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

పాలిసెట్‌ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిసెట్‌ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ప్రారంభమైనట్లు జిల్లా పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌ శైలేంద్రకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి రోజున 200 మంది హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్‌ విద్య తో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అభ్యర్థు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్స్‌లో ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభమైందన్నారు. పదో తరగతి విద్యార్థులందరూ https//:polycet ap.ap.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఈనెల 9 వరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు. సమాచారం కోసం 9912377723 సంప్రదించాలని పేర్కొన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి

నంద్యాల: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామాల్లో ఉన్న బోర్‌వెల్స్‌కు తప్పనిసరిగా జియో మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ జూనియర్‌ ఇంజినీర్లు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార మాధ్యమాల్లో వెలువడే తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్‌కు నివేదికలు అందజేయాలన్నారు.

ఆదోని అర్బన్‌: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర శనివారం క్వింటా రూ.9,079 గా నమోదయ్యింది. గత వారం రోజుల నుంచి రోజుకు రూ.100 చొప్పున పెరుగుతూ శనివారానికి రూ.9 వేలు పైనే ధర పలికింది. ఈ మేరకు 1248 క్వింటాళ్ల పత్తి రాగా, గరిష్ట ధర రూ. 9,079, మధ్య ధర రూ.8,742, కనిష్ట ధర రూ.4,189గా నమోదయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement