మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పూర్వ పీఠాధిపతి సుశమీంద్రతీర్థులు శతమహోత్సవ జయంతి ఆరాధన వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా డోలోత్సవ మండపంలో జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. వేడుకల్లో భాగంగా సుశమీంద్ర తీర్థులు మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీసుశమీంద్ర తీర్థుల బృందావనానికి పంచామృతాభిషేకాలు, మంగళహారతులు చేపట్టారు. అనంతరం శ్రీ సుశమీంద్ర తీర్ధులు చిత్రపటానికి పుష్పార్చన, దీపారాధన చేశారు. ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మట్లాడుతూ.. శ్రీరాఘవేంద్రస్వామి మఠం గురువులు పూర్వపీఠాధిపతి శ్రీ సుశమీంద్ర తీర్థుల సేవలు మరవరానివి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, మంత్రాలయం మఠం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.
అన్నదాన కోసం రెండు లక్షల విరాళం:
ప్రముఖ పుణ్యక్షేత్రంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కోసం ఆదోనికి చెందిన మీనప్ప కుటుంబ సభ్యులు రెండు లక్షలు రూపాయలు అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు.అనంతరం ఆ కుటుంబ సభ్యులకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలతో శ్రీరాఘవేంద్రల జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు.


