నిబంధనలకు పాతర.. మందు జాతర! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు పాతర.. మందు జాతర!

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో మద్యం విక్ర యాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎకై ్సజ్‌ పోలీసుల జాడ లేదు. జాతరలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఒకరి పేరున లైసెన్స్‌ పొంది.. మరొకరు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోవటం లేదు. తర్తూరు గ్రామానికి చెందిన కమాల్‌బాషా పేరున జాతరలో ఈనెల 2 నుంచి 5 వరకు మద్యం విక్రయించేందుకు ఎకై ్సజ్‌, ప్రొహిబిషన్‌ జిల్లా అధికారులు ఈవెంట్‌ పర్మిషన్‌ ఇచ్చారు. సదరులైసెన్స్‌ దారుడు కర్నూల్లోని ఐఎంఎఫ్‌ఎల్‌ పాయింట్‌ వద్ద 12 శాతం రుసుం అధికంగా చెల్లించి మద్యం కొనుగోలు చేసి జాతరలో విక్రయించుకోవాలని ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆదేశించారు. ఈ రుసుం చెల్లించకుండా జూపాడుబంగ్లాలోని మద్యం దుకా ణాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వార్టర్‌ మద్యం సీసాపై రూ.20లు అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నా సివిల్‌ పోసులు సైతం కన్నెత్తిచూడటం లేదనే విమర్శలున్నాయి.

కేసులు నమోదు చేస్తాం

తర్తూరు జాతరలో నిర్వహిస్తున్న ఈవెంట్‌ మద్యం దుకాణంలో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన మద్యం కాకుండా అక్రమ మద్యం విక్రయిస్తే దుకాణం సీజ్‌చేసి లైసెన్స్‌దారునిపై కేసు నమోదు చేస్తామని ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ స్క్వాడ్‌ సీఐ సుభాషిణి హెచ్చరించారు. శుక్రవారం ఆమె తర్తూరు జాతరలోని మద్యం దుకాణాన్ని తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement