● కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంక్షేమ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోషల్ వెల్ఫేర్ శాఖ పనితీరు తగిన స్థాయిలో ఉన్నప్పటికీ, బీసీ వెల్ఫేర్ శాఖ పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నా రు. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్ర కారం నాణ్యమైన ఆహారం అందుతుందో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి హాస్టల్‌లో మెనూ వివరాలతో పెద్ద హోర్డింగ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పేద విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, తాగునీరు, పారిశుద్ధం, ఆహార నాణ్య త, వార్డెన్ అందుబాటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపా రు. హాస్టళ్లలో ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయా లన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ అధి కారి చింతామణి, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.


