ఏసీబీ వలలో హెడ్‌ కానిస్టేబుల్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో హెడ్‌ కానిస్టేబుల్‌

Apr 1 2026 10:59 AM | Updated on Apr 1 2026 10:59 AM

ఆళ్లగడ్డ: లంచం తీసుకుంటూ ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కమ్మరి రఘునా థాచారి ఓ వ్యక్తిని రాయితో కొట్టారని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వర్‌రావు నిందితుడి రఘునాథాచారితో రిమాండ్‌కు పోకుండా స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటే రూ. 40 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో గత వారం రోజుల క్రితం రఘునాథాచారి హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వర్‌రావుకు రూ. 20 వేలు ఇవ్వడం జరిగింది. అయినా మిగతా సొమ్ము ఇవ్వాలని బెదిరించడంతో రఘునాథాచారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ. 15 వేలు ఇస్తానని రఘునాథాచారి ఒప్పందం చేసుకోవడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ అహోబిలం బైపాస్‌ రోడ్డుకు వస్తాను అక్కడ ఇమ్మని చెప్పాడు. అక్కడ రఘునాథాచారి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా హెడ్‌ కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. దీని వెనుక ఎవరై నా ఉన్నారా.. అన్న కోణంలో విచారణ చేస్తామన్నారు.

మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.21.57 లక్షలు

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.21.57 లక్షలు చేకూరింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రం హుండీ లెక్కింపు మంగళవారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్‌ పర్యవేక్షణలో 27 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ మేరకు రూ.21,57,817 నగదు, ఐదు గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు వివరించారు. కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్‌ సభ్యులు, డోన్‌, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement