కాటసాని చొరవతో రైతులకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

కాటసాని చొరవతో రైతులకు న్యాయం

Apr 1 2026 10:59 AM | Updated on Apr 1 2026 10:59 AM

కల్లూరు: వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో నే తమకు న్యాయం జరిగిందని ఓర్వకల్లు మండల రైతులు అన్నారు. ఓర్వకల్లు మండల పరిధిలోని పాలకొలను, హుసేనాపురం గ్రామాలకు చెందిన డీఆర్‌డీఓ భూనిర్వాసితులైన 21 మంది రైతులు మంగళవారం కాటసాని రాంభూపాల్‌రెడ్డిని స్వగృహంలో కలిసి, శాలువాతో సన్మానించి, కేక్‌ కట్‌ చేశారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 4.30 లక్షల చొప్పున మొత్తం రూ. 1.30 కోట్లకు పైగా పరిహారం వచ్చిందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement